Farmers | సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Farmers | సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Farmers | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.

కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడవకుండా తగిన సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను అవసరమైన ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. రైతుల ధాన్యం భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం లేకుండా ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply