AI Tirumala | ఏఐతో మరింత సమర్థవంతంగా తిరుమల భక్తుల సేవలు

AI Tirumala | ఏఐతో మరింత సమర్థవంతంగా తిరుమల భక్తుల సేవలు

AI Tirumala | ఏఐతో తిరుమల భక్తుల సేవలు మరింత సమర్థవంతం
టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
వసతి, క్యూ లైన్లు, లడ్డూ పంపిణీపై రియల్ టైమ్ పర్యవేక్షణ
“ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో మొక్క నాటిన కేంద్ర మంత్రి

తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విధానం ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

AI Tirumala

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా వసతి గదుల ఆక్యుపెన్సీ, భక్తుల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విధానం వల్ల భక్తులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని అన్నారు.

AI Tirumala

గదుల లభ్యత, వివిధ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య, గంటల వారీగా తిరుమలకు చేరుకుంటున్న యాత్రికుల వివరాలు, లడ్డూ పంపిణీ సమాచారం వంటి అంశాలు తక్షణమే అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. కేవలం వంద రోజుల వ్యవధిలో ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ అధికారులను అభినందించారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రవాస భారతీయ భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

AI Tirumala

అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. తన తల్లి పేరుతో తిరుమలలో మొక్క నాటడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

AI Tirumala

ప్రతి చిన్నారి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి, దానిని జీవితాంతం సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో తన జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. దేశ సేవకు, ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేసేలా శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

AI Tirumala

శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.

AI Tirumala
AI Tirumala

CLICK HERE TO READ 41,999People | దుర్గమ్మ దర్శనానికి బారులు

CLICK HERE TO READ MORE