15year | ఇండియ‌న్ జ‌ట్టుకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక‌పై ఆసక్తి

15year | ఇండియ‌న్ జ‌ట్టుకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక‌పై ఆసక్తి

15year | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్‌లో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ త్వరలో భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం అతని పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైభవ్‌కు అవకాశం దక్కి అరంగేట్రం చేస్తే, 1989 నుంచి సచిన్ టెండూల్కర్ పేరిట కొనసాగుతున్న అత్యంత పిన్న వయసులో భారత జట్టుకు ఆడిన ఆటగాడి రికార్డు బద్దలవుతుంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ యువ ఆటగాడిపై ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టి నిలిచింది

రికార్డు ఏమిటి?
1989లో పాకిస్థాన్ పర్యటనలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఆయన భారత పురుషుల క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ టీ20 సిరీస్ లేదా ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అవకాశం లభిస్తే, సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

సెలెక్టర్ల దృష్టిలో వైభవ్
ఐపీఎల్ 2026లో వైభవ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడంతో పాటు, 72 సిక్సర్లతో కొత్త రికార్డులు నెలకొల్పాడు. అతని దూకుడు బ్యాటింగ్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఐర్లాండ్‌తో జూన్ చివర్లో జరిగే టీ20 సిరీస్‌కు వైభవ్ పేరు షార్ట్‌లిస్ట్ అయినట్లు సమాచారం. అయితే భారత జట్టు అధికారికంగా ప్రకటించే వరకు దీనిపై స్పష్టత లేదు.

Leave a Reply