V-Guard Industries | 5స్టార్ బీఈఈ రేటింగ్ ను పొందిన వి-గార్డ్ ఇండక్షన్ కుక్‌టాప్

V-Guard Industries | 5స్టార్ బీఈఈ రేటింగ్ ను పొందిన వి-గార్డ్ ఇండక్షన్ కుక్‌టాప్
V-Guard Industries | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశ ప్రముఖ వినియోగదారుల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన వి-గార్డ్ ఇండస్ట్రీస్(V-Guard Industries) లిమిటెడ్, తన ఇండక్షన్ కుక్‌టాప్ మోడల్ వీఐసీ06వీ1, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ ) నుండి 5-స్టార్ (★★★★★) శక్తి సామర్థ్య రేటింగ్‌ను పొందిన భారతదేశపు మొట్టమొదటి ఇండక్షన్ కుక్టాప్గా అవత రించడంతో ఒక చరితాత్మక మైలురాయిని సాధించింది.
ఈ గుర్తింపు శక్తి-ఆదా ఆవిష్కరణ, అంతర్గత తయారీ నైపుణ్యం, రాజీలేని నాణ్యతా ప్రమాణాల పట్ల వి-గార్డ్ నిబ ద్ధతను నొక్కి చెబుతుంది. వీఐసీ 06వీ1 ఇండక్షన్ కుక్‌టాప్ వి-గార్డ్ అత్యాధునిక పెరుండురై కేంద్రంలో రూపొందించబడి, తయారు చేయబడింది.
ఈ విజయంపై వి -గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చిట్టిలప్పిల్లి(Mithun Chittilapilli) మాట్లాడుతూ… ఈ గుర్తింపు తమ అంతర్గత డిజైన్, తయారీ నైపుణ్యం, నాణ్యతా ప్రమాణాలు, శక్తి-ఆదా ఆవిష్కరణలపై తమ బలమైన దృష్టిని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ మైలురాయి కొత్త పరిశ్రమ ప్రమాణాన్ని నిర్దేశిస్తుందన్నారు. శక్తి-ఆదా గృహో పకరణాలలో వి- గార్డ్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ఈ గణనీయమైన విజయంతో, వి-గార్డ్ వీఐసీ 06వీ1(06V1) భారతదేశంలో ఇండక్షన్ కుకింగ్ విభాగంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందన్నారు. ఆధునిక భారతీయ కుటుంబాల కోసం సుస్థిరమైన, అధిక పనితీరు గల వంటగది ఉపకరణాలను అందించడంలో ఒక మార్గదర్శకురాలిగా కంపెనీ పాత్రను ఇది పునరుద్ఘాటిస్తుందన్నారు.
