పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కనపర్తి శ్రీనివాసరావు
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కనపర్తి శ్రీనివాసరావు
మోపిదేవి – ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పచ్చదనం-పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మోపిదేవి మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మోపిదేవి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు విచ్చేసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భావితరాల మనుగడకు పర్యావరణ సమతుల్యత ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, మోపిదేవి ఎంపీపీ నడకుదిటి జననీ కుమారి,మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్ధన రావు, అవనిగడ్డ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సాయి బాబు, గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వీరబాబు, మోపిదేవి ఎంపీడీవో స్వర్ణ భారతి, మండల విద్యాశాఖాధికారులు గోపాల్, శంకరరావు, ఏపీవో ముత్యాలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
