మౌలిక వసతుల కల్పనకే అధిక ప్రాధాన్యత.

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలకు మౌలిక వసతుల కల్పనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు.సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో గుణదల మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీవాసులు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలనీలో రహదారి సౌకర్యం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.