GreenMission | పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి
GreenMission | పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి
GreenMission | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతిపట్ల తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు. ‘అమ్మ పేరుతో మొక్క’ కార్యక్రమంలో భాగంగా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో తన తల్లి అంజనా దేవి పేరుతో ‘తెల్ల పొణికి’ మొక్కను నాటి ప్రత్యేక సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తల్లి పేరుతో మొక్క.. ప్రకృతికి అంకితం
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొండపల్లి బొమ్మల తయారీలో కీలకంగా ఉపయోగించే ‘తెల్ల పొణికి’ మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ కళలను, ప్రకృతి సంపదను పరిరక్షించడం సమాజ బాధ్యత అని అన్నారు.
విద్యార్థులతో కలిసి 1,000 మొక్కల నాటకం
డిప్యూటీ సీఎం సమక్షంలో విద్యార్థులు ఏకకాలంలో వెయ్యి అంకుడు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన పవన్ కళ్యాణ్, పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
