గవర్నర్‌కు ఘన స్వాగతం..
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల శుక్రవారం హెలికాప్టర్ ద్వారా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న గవర్నర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నీతికా పంత్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు పలువురు అధికారులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.
ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై గవర్నర్ అధికారులతో చర్చించినట్లు అధికారులు తెలిపారు.
