నూతన అధ్యక్షులను సన్మానించిన వైస్ చైర్మన్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షుడిగా నియామకమైన డాక్టర్ దాస0డ్ల ప్రభాకర్, ఉట్నూర్ టౌన్ అధ్యక్షులుగా నియమైపోయిన సయ్యద్ నీశార్ లను శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కొత్తగూడలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానోత్ జైవంతరావు తన నివాసంలో శాలువాలతో సన్మానం చేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృత చేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధ్యక్షులుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కష్టపడ్డ ప్రతీ ఒకరికి గుర్తించి వారికి తగ్గట్టు పదవులు కేటాయించడం సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి లొ భాగం అయి అందరము కలసి కట్టుగా పని చేసి తెలంగాణ లోనే ఖానాపూర్ నియోజకవర్గం ఒక మాడల్ గా ఉండాలని ఆయన కోరారు. ఈ సన్మాన కార్యక్రమం లో ఉప సర్పంచ్ కామెర శ్రీను, గ్రామ అధ్యక్షులు జాదవ్ రాహుల్, నాయకులుభూక్యావెంకట్రావు,రాథోడ్ వినోద్,కామెర ప్రసాద్,బాదావత్ సాయి, జాదవ్ సాయి,భూక్యా శేఖర్,నాగవత్ శ్రీకాంత్,భూక్యా మోహన్, జాదవ్ రాజు,భూక్యా మహేష్,భూక్యా సోను,భూక్యా ఆర్య, బానోత్ అజయ్, తదితరులు పాల్గొన్నారు.
