12వ వేజ్ బోర్డు అమలు చేయాలి..
- సీహెచ్‌పీ కార్మికుల ధర్నా
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ సీహెచ్‌పీ సివిల్ డిపార్ట్మెంట్లో జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ వేజ్ బోర్డు కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి, వేజ్ బోర్డును త్వరగా అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, వాటిని సింగరేణిలో అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం సీహెచ్‌పీ ఫుడ్ సెక్రటరీ హరి రామకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఓడీ చంద్రమౌళికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఐఎన్టీయూసీ నాయకుడు మంతెన గోపి, హెచ్ఎంఎస్ నాయకుడు రామస్వామి, సీఐటీయూ నాయకుడు సతీష్, నాయకులు సీతారామరావు, సిరాజుద్దీన్, శ్రీధర్‌రావు, శ్రీనివాస్, నాగరాజు, కార్మికులు మల్లమ్మ, రజిత, చిలుకమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.
