జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు..

జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు..

ఉత్పత్తుల కొనుగోలుపై జిసిసి ఉద్యోగుల అవగాహన
ఉమ్మడి జిల్లా అంతటా కొనుగోలు : జి సి సి డి ఎం సందీప్ కుమార్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : గత రెండేళ్ల తర్వాత గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ జిసిసి జిఎం ఆదేశాల మేరకు ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ ద్వారా ఏడాది అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ తోపాటు కామారెడ్డి ప్రాంతాల్లోని మండలాల్లో జిసిసి సేల్స్మేన్ ల, ఉద్యోగుల ద్వారా మండలాల్లో గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నారు. గిరిజన ప్రజలు, గిరిజనేతరులు సేకరించిన ఇప్పపువ్వు,చింతపండు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ జిసిసి సమస్యకు లాభం చేకూరేలా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

అటవీ ఉత్పత్తుల మద్దతు ధరలు

జిసిసి కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్న అటవీ ఉత్పత్తుల మద్దతు ధరలు వివరాలు ఇవే ఇప్పపువ్వు కిలో ధర 30 రూపాయలు తేనె 225, ఇప్ప గింజలు 29 రూపాయలు, తప్సి జిరుగు మేలు రకం కిలో114 రూపాయలు, తేనె మైనం కిలో160, మారేడు గడ్డలు కిలోకు 190, చింతపండు కిలో కు 70, ఎండు ఉసిరి పప్పు కిలోకు 52 రూపాయలు, విష ముష్టి గింజలు కిలోకు 70, చిల్లగింజలు 35, నర మామిడి చెక్క కిలోకు 32, కరక్కాయలు కిలోకు 15 రూపాయలు, కుంకుడు కాయలు కిలోకు 45, నల్ల జీడిగింజలు కిలోకు 12 కానుగ గింజలు కిలోకు పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు ఉట్నూర్ జిసిసి డిఎం గుడిమల్ల సందీప్ కుమార్ తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో అంతటా కొనుగోలు చేస్తున్నాం
ఉట్నూర్ జిసిసి డిఎం గుడిమల్ల సందీప్ కుమార్

ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాల తో పాటు కామారెడ్డి ప్రాంతాల్లో ని అన్ని మండలాల్లో జిసిసి కార్పొరేషన్ సంస్థ ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఉట్నూర్ జిసిసి డిఎం గుడిమల్ల సందీప్ కుమార్ ఆంధ్రప్రభ తో తెలిపారు. జిసిసి సేల్స్ మేళ ద్వారా 90 శాతం కొనుగోలు చేస్తున్నామని జిసిసి ఉద్యోగుల ద్వారా కూడా మండలాల్లో కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫోటో ఐటీడీఏ పీవో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గిరిజన కార్పొరేషన్ సీఎండి, కార్పొరేషన్ చైర్మన్ఆదేశాల మేరకు ఏడాది అన్నిచోట్ల కొనుగోలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అటవీ ఉత్పత్తుల మద్దతు ధరలపై కొనుగోలు పై జిసిసి సేల్స్ మెన్ ఉద్యోగుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించి డిఆర్ డిపోలో మండల కేంద్రాల్లో అటవీ ఉత్పత్తుల కొనుగోలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గిరిజనులు గిరిజనేతరులు సేకరించిన అటల్ ఉత్పత్తులు చింతపండు లాంటి ఉత్పత్తులను జిసిసి కార్పొరేషన్ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని తగిన మద్దతు ధర పొందాలని ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూర్ జిసిసి డిఎం సందీప్ కుమార్ కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని అటవీ ఉత్పత్తులకు తగిన మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని ప్రజలు జిసిసి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.