నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సింహులపేట మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్,ఎస్సై భానోత్ వెంకన్నలు హెచ్చరించారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో విత్తనాలు, పురుగుమందులు,ఎరువుల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుమతించిన,ధృవీకరించిన విత్తనాలనే విక్రయించాలని నకిలీ విత్తనాల అమ్మకాలను పూర్తిగా నివారించాలని వారికి సూచించారు.రైతుల నమ్మకాన్ని కాపాడుతూ బిల్లులు,లేబుళ్లతో కూడిన విత్తనాలు విక్రయించడం ద్వారా దిగుబడులకు సహకరించాలని నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ,పోలీస్ అధికారులు సంయుక్తంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక తదితరులు ఉన్నారు.