May1st | సీఎం విజ‌య్ సంచ‌ల‌న నిర్ణ‌యం

May1st | సీఎం విజ‌య్ సంచ‌ల‌న నిర్ణ‌యం

May1st | రూ.50 వేలు రుణం తీసుకున్న ప్ర‌తి రైతుకి విముక్తి
త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని ఆదేశం

May1st | చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త శుభవార్త అందించారు. సాగు పెట్టుబడుల భారంతో సతమతమవుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు రూ.50,000 వరకు ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సహకార బ్యాంకులలో గతేడాది మే 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 మధ్య కాలంలో రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరడమే కాకుండా, వారిపై ఉన్న పాత అప్పుల భారం తక్షణమే తొలగిపోనుంది.

శ్లాబ్‌ల‌ వారీగా రుణమాఫీ విధానం
ఈ రుణమాఫీ పథకాన్ని కేవలం రూ. 50,000 లోపు ఉన్న వారికే పరిమితం చేయకుండా, అంతకంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కూడా ఊరట కలిగించేలా ప్రభుత్వం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించింది. రూ. 50,000 నుంచి రూ. లక్ష , అంతకంటే ఎక్కువ బకాయిలు ఉన్న రైతులకు ఊరటనిచ్చేందుకు మొత్తం 6 శ్లాబ్‌ల‌ను ఏర్పాటు చేశారు. వీటిని పరిధిని బట్టి రైతులకు రూ. 20,000, రూ. 15,000, రూ. 10,000, రూ. 5,000 చొప్పున అదనపు రాయితీ రూపంలో రుణమాఫీ లబ్ధిని చేకూర్చనున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే ఈ నిధులను సర్దుబాటు చేసేందుకు సహకార శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

CLICK HERE TO READ Delhi | రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం

CLICK HERE TO READ MORE

Leave a Reply