చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తులను ప్రోత్సహిస్తుందని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లిఅంజయ్యఅన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలో ని బిజ్వార్ లో పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారుడికి సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాభివృద్ధికి నిరంతరం చేస్తున్నారని చేతివృత్తుల వారికి చేతనందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద సామాగ్రి పంపిణీ చేస్తున్నదనిఅన్నారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలను ప్రోత్సహిస్తూ చేతివృత్తులకు చేయూతని అందించడం సంతోషంగాఉందన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఎంపీటీకే అరుణ, కేంద్ర ప్రభుత్వ నిధులతో బిజ్వార్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధి పొందిన కమ్మరి రాఘవులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సీనియర్ ఆంజనేయులు గౌడ్, వార్డు సభ్యులుచెన్నారెడ్డి, నాయకులు కార్యకర్తలు రాఘవేంద్ర , జి. రాజు, పత్తి ఆంజనేయులు, అశోక్ కుమార్, బీమేష్,తదితరులు పాల్గొన్నారు.