సర్ ఇంటింటి సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి
- సొసైటీ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి
కేసముద్రం, ఆంధ్రప్రభ : సర్ ఇంటింటి సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలనీ సొసైటీ వైస్ చైర్మన్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోనీ అమీనాపురంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహిస్తున్న ( సర్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక సమగ్ర సవరణ) జూన్ 25 నుండి జూలై 24 వరకు నిర్వహించే ఓటర్ల సవరణ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పావిరాల శరత్ యాదవ్ తో కేసముద్రం సింగిల్ విండో బ్యాంక్ వైస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పార్టీలకతీతంగా పాల్గొని 5 6 వార్డులలోని ఒక ఇల్లు కూడా తప్పిపోకుండా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు అయ్యేవిధంగా చూడాలని కోరారు . అదేవిధంగా 5 ,6 వార్డులలో బిఎల్వోలు 5వ వార్డు సుధాకర్,6 వ వార్డ్ ప్రశాంత్, అన్ని పార్టీల బిఎల్ఏలు పాల్గొని ప్రతి ఓటరుకు ఎన్యుమ రేషన్ ఫారం ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దానిలో మీ సమగ్ర సమాచారాన్ని వారి సహకారంతో నింపినట్లైతే వాటిని తిరిగి బిఎల్ఓ లు తీసుకుని ఆన్లైన్ చేయడం జరుగుతుందనీ సూచించారు.
జీవనోపాధికి బయటికి వెళ్లిన వారు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ ను నింపియవలసిందిగా కోరడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వారు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, ఫామ్ 7 ద్వారా అడ్రస్ మార్పిడి , రెండు ఓట్లు ఉన్నచో ఎక్కడ ఉండాలో ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఫామ్ 8 ద్వారా మన ఫోటో , పేరు తప్పు ఉంటే సవరించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి సవరణ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉంటే ఓటు హక్కు పోయే ప్రమాదం ఉందనీ హెచ్చరించారు. రాజకీయలకతితంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేసి నిజమైన ఓటు హక్కుకు విఘాతం కలగకుండా, చనిపోయిన ఓట్లను ,బూటకపు ఓట్లను తొలగించే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ , బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
