ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్

ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్

మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్

భవానిపురం, ఆంధ్రప్రభ:
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు, సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.

ప్రధానంగా తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, నూతన గృహాల కొరకు దరఖాస్తులు వంటి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేసేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశించారన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుందని మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రజా దర్బార్: వడ్లాని మాధవరావు
బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో విద్య, వైద్యంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజలందరూ ప్రజా దర్బార్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ శ్రీనివాస రావు, ఎలక్ట్రికల్ ఏఈ ప్రకాష్, టాప్ ఇన్స్పెక్టర్లు పీ. శ్రీనివాస్, సయ్యద్ కాజా, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్, మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి దుర్గారావు, గుండారపు హరిబాబు, ఎన్డీఏ కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, పీవీ కాంతారావు, కొప్పుల గంగాధర్, దాడి మురళి కృష్ణ, ఏలూరు సాయి శరత్, మోరబోయిన రాంబాబు, బాదర్ల శివ, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.