కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి..

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి..

మంత్రి కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలికిన ఈవో..
అమ్మవారికి ప్రత్యేక పూజలు..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అర్చకులు, వేదపండితులు ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ ఆధ్వర్యంలో మంత్రి పార్థసారధికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం మంత్రికు జన్మదినం సందర్బంగా వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శీనానాయక్ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, ఉప ప్రధాన అర్చకులు బి. శంకర శాండిల్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply