మార్లవాయి నూతన సర్మిడి సభ్యులకు సన్మానం
మార్లవాయి నూతన సర్మిడి సభ్యులకు సన్మానం
జైనూర్, ఆంధ్రప్రభ:
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గొండ్వానా పంచాయితీ రాయి సెంటర్ నూతనంగా ఎన్నికైన సర్మిడి గేడం గణపత్ రావు, గుత్తెదార్ గా ఆత్రం భగవంతరావు, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనే రావులకు మార్ల వాయి సర్పంచ్ కనక ప్రతిభా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ వ్యవస్థ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఆదివాసీ సమాజం ముందుకు సాగేందుకు విద్య, వైద్య, వ్యవసాయం రంగాలలో రాయి సెంటర్ కీలక పాత్ర పోషించాలని సర్పంచ్ కనక ప్రతిభ అన్నారు.
సమాజంలో కష్టసుఖాలలో ఎల్లప్పుడూ బాసటగా ఉండాలని ఆకాంక్షించారు. చరిత్ర కలిగిన మార్ల వాయి రాయి సెంటర్‌కు నూతనగా నియామకమైన మార్ల వాయి సార్ మేడి గేడం గణపతి రావ్, గీతాదర్ ఆత్రం భగవంత్ రావ్, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనేరావ్ సభ్యులు మంచి సేవలందించి రాయి సెంటర్ కు మంచి పేరు తేవాలని సర్పంచ్ కోరారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలోఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, వార్డ్ సభ్యులు కనక భరత్, తుంరం సీత, కొడప పుల్లబాయి, తొడసం సర్జబాయి, జూగ్నకధైర్యవంతి,గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్,పీసా మొభాలైజర్ కనకయాదవ్,అంగన్వాడీ టీచర్ కొడప నెత్తుబాయి,ఆశ వర్కర్ ఆడ చంద్రకళ,ఆత్రం దేవషావ్ పటేల్,గ్రామపంచాయతీ సిబ్బంది: సోనే రావ్, జ్యోతి రామ్, లచ్చు తదితరులు పాల్గొన్నారు.
