కేజీ మల్లేల సహకార సంఘం అధ్యక్షులుగా కంటే చెన్నారావు

కేజీ మల్లేల సహకార సంఘం అధ్యక్షులుగా కంటే చెన్నారావు

  • అభినందనలు తెలిపిన బీఆర్ఎస్ నేతలు

వేంసూరు, ఆంధ్రప్రభ: కేజీ మల్లేల సహకార సంఘం అధ్యక్షులుగా కంటే చెన్నారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఏడాది క్రితం సహకార సంఘాల అధ్యక్షుల పదవీ కాలం ముగిసి పోవడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కొందరు అధ్యక్షులు కోర్టుకు వెళ్ళగా, తిరిగి పాత అధ్యక్షులకే అవకాశం కల్పించింది. కేజీ మల్లేల సహకార సంఘం అధ్యక్షులు కాటే జమలారావు అడసర్లపాడు గ్రామ పంచాయితీ సర్పంచిగా విజయం సాధించటంతో అధ్యక్ష పదవికి రాజీనామ చేశారు. దీంతో సీనియర్ డైరెక్టర్ అయిన కంటే చెన్నారావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.

సోమవారం బాధ్యతలు చేపట్టిన చెన్నారావు కు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, జోనల్ కమిటీ అధ్యక్షులు దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, చెరుకు అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ పుచ్చకాయల శంకరరెడ్డి, నల్లమోతు ప్రసాద్, పోటు ప్రసాద్, సర్పంచ్ కాటే జమలారావు, దొడ్డా శోభనాచలం నాయకులు గాదె శ్రీనివాసరావు, మారోజు సురేష్, వల్లభనేని సత్యనారాయణ, మందపాటి శేఖరరెడ్డి, మాజీ టెలికం జిల్లా డైరెక్టర్ మిరియాల ప్రసాద్, కంటే అప్పారావు, కంటే నాగేశ్వరరావు, డీలర్ వెంకటేశ్వరరావు, వల్లభనేని సత్యనారాయణ, కంటే పెద్దన్న, కొనకాల లక్ష్మీనారాయణ, తాత కృష్ణయ్య, పెద్దగౌడ్ అప్పారావు, మామిడి శ్రీనివాసరావు, రాజబోయిన నరసింహారావు తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.