గ్యాస్ కోసం రెండో రోజు నిరసన

గ్యాస్ కోసం రెండో రోజు నిరసన

  • రోడ్డు పై బైఠాయించిన గ్యాస్ వినియోగదారులు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : గ్యాస్ కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన గ్యాస్ వినియోగదారులు. సంస్థన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ గ్యాస్ ఏజెన్సీ గృహ వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, హోటళ్లకు బ్లాక్ లో పక్కదారి పట్టిస్తున్నారని వినియోగదారుల ఆరోపిస్తున్నారు.

తక్షణమే అధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా ఇదే సమస్య కొనసాగుతుందని సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నారని తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్యాస్ ఇప్పిస్తామని హామీ ఇచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.