సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

ఆలేరు, ఆంధ్రప్రభ : కురుమ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని హర్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు చిన్నం యాదగిరి, మాజీ అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్, 10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్, 12వ వార్డు కౌన్సిలర్ జెట్ట నీరజ సిద్ధులు పాల్గొన్నారు.

అలాగే కురుమ సంఘం నాయకులు చిమ్మి అబ్బసాయిలు, పేరపు రాములు, కూళ్ల నర్సింహులు, పిక్క శ్రీనివాస్, కొన్నే మల్లేష్, ఎగ్గిడి శ్రీనివాస్, పరపు సిద్ధులు, బండ శ్రీను, బుడిగె సిద్ధులు, మచ్చ సాయిమల్లయ్య, బాల్ద శేఖర్ తదితరులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.