చండ్రుగొండ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పై తేనెటీగల దాడి

చండ్రుగొండ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం లో ఉన్నా చెట్టుపై భారీగా ఉన్నా తేనె టీగలు సప్లమెంటరీ విద్యార్థులకు క్లాస్ చెప్పేందుకు వచ్చిన సైన్స్ టీచర్ అనితా బేబీ పై దాడీ చేసాయి. భయంతో పరుగులు పెట్టిన ఆమె కిందపడిపోయారు. అప్పటికి సప్లమెంటరీ విద్యార్థులు స్కూలుకు చేరుకోలేదు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆర్ ఎం పి వద్ద ప్రధమ చికిత్స కోసం కు తరలించారు. వందలమంది విద్యార్థులు చదివే పాఠశాలలో ప్రమాదకరం గా ఉన్న తేనె పట్టును తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
