భక్తులకు కాషాయ టీ షర్ట్ ల పంపిణీ

భక్తులకు కాషాయ టీ షర్ట్ ల పంపిణీ

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకు మంగళవారం మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా కాషాయ టీ షర్ట్ లను స్వయంగా పంపిణీ చేశారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులు కాషాయ రంగు దుస్తుల్లో వచ్చి తమ భక్తి శ్రద్ధలను చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు గౌరు శ్రీనివాస్, బుస్స రవి,కొప్పుల కరుణాకర్ రెడ్డి, పోచం కన్నయ్య,ఏలే నగేష్,జిట్ట నవీన్ కుమార్,కిరణ్ కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.