ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్ సమత
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఈనెల 17 ఆదివారం ఆదిత్య కేర్ హాస్పిటల్ హాలియాలో రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్లగొండ ఆధ్వర్యంలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రివర్ నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ సమత తూప్రాన్ పేర్కొన్నారు. ఈ శిబిరంలో బిపి, షుగర్ , సీరం తదితర కిడ్నీ పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా కొన్ని రకాల మందులను అందజేయడం జరుగుతుందని హాలియా పరిసర ప్రాంతాల ప్రజలు, కిడ్నీ రోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
