పేదల వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి చేయూత..
కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో పేదల వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలం నవాబ్‌పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఒక వరంగా మారిందని, ఆపదలో ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంట్యాల లచ్చన్న, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడి లచ్చన్న, వార్డు సభ్యులు మోరపాక రాజు, జెడ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
