కమిషనర్ ను సన్మానించిన చైర్మన్ పందిరి గీత

కమిషనర్ ను సన్మానించిన చైర్మన్ పందిరి గీత

చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మున్సిపాలిటీ కి నూతన కమిషనర్ గా గురు లింగం శనివారం నాడు బాధ్యతలు తీసుకున్నారు. వైరా మున్సిపాలిటీ నుండి బదిలై చిట్యాల మున్సిపాలిటీకి వచ్చారు. ఇంచార్జ్ రంజిత్ కుమార్ నుండి పూర్తి కమిషనర్ గా బాధ్యత స్వీకరించారు. ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, నూతన కమిషనర్ ను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు బొబ్బలి సందీప, జేరి పోతుల సత్యనారాయణ, ఏర్పుల పరమేశం, కుక్కల లత, గాలి యాదమ్మ, కోనేటి ఎల్లయ్య, కుక్కల మోహన్ తదితరు పాల్గొన్నారు.

Leave a Reply