రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేద్దాం

రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేద్దాం
బీఆర్ఎస్ పరకాల మండలం అధ్యక్షుడు చింతి రెడ్డి మధుసూదన్ రెడ్డి
పరకాల, ఆంధ్రప్రభ: రైతు సంగ్రామ సదస్సు రైతు సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పరకాల మండల అధ్యక్షుడు, పరకాల మాజీ వైస్ ఎంపీపీ చింతి రెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మే6 గ్రీన్‌వుడ్ హైస్కూల్ పక్కన స్థలం, హంటర్ రోడ్ వరంగల్ లో సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. పరకాల మండలంలోని ఆయా గ్రామాల రైతులు రైతు సంగ్రామ సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని మధుసూదన్ రెడ్డి కోరారు.
