పార్టీ బలోపేతానికి కృషి చేయండి..
పార్టీ బలోపేతానికి కృషి చేయండి..
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఐ. టీడీపీ సెంట్రల్ అధ్యక్షుడు దుర్గాసి రాము జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ శ్రేణులు సమక్షంలో రాముతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు.
పార్టీ కోసం కష్టించే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని అటువంటి వారికి పార్టీ కేటాయించే ఉన్నత పదవులు కట్టబెడతామని బోండా ఉమా అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్య ప్రకాష్, కంచేటి నాగరాజు, బూదాల సురేష్, డిడి నాయుడు, లక్కీశెట్టి సాయి, బి.ఆంజనేయులు, దేవర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
