ఎన్డీఏ కార్యాలయం వద్ద బీజేపీ విజయోత్సవం..

ఎన్డీఏ కార్యాలయం వద్ద బీజేపీ విజయోత్సవం..
మూడు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయంతో సుజనా చౌదరి కార్యాలయం వద్ద ధూమ్ ధాం…
భవానిపురం, ఆంధ్రప్రభ : మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో విజయవాడలో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాలను అంటుంటున్నాయి.. మంగళవారం భవానీపురంలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం వద్ద ఎపి బిజెపి అధ్యక్షులు పివియన్ మాధవ్ ఆధ్వర్యంలో ధూమ్ ధాం నిర్వహించారు.. మాధవ్ తో పాటు ఇతర నాయకులు తీన్ మార్ వాయించి సందడి చేశారు.. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు..
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పీవియన్ మాధవ్ మాట్లాడుతూ బీజేపీ పై నమ్మకం తో ప్రజలు మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారన్నారు.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ “రౌడీ పరిపాలన”కు ప్రజలు అంతం పలికారనీ తెలిపారు.. బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తము మవుతున్నాయన్నారు. అక్కడ బిజెపి సాధించిన విజయం చారిత్రాత్మకమని, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండటం దేశాభివృద్ధికి నిదర్శనామని తెలిపారు..

హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాం, పాండిచ్చేరిలో అద్భుత విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, షేక్ బాజీ, నాగలక్ష్మి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..

