బాలకృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే వేముల భరోసా
బాలకృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే వేముల భరోసా
చిట్యాల, ఆంధ్రప్రభ: నోష్ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి, గాయపడిన వారికి నకిరేకల్ శాసనసభ్యులు యాజమాన్యంతో చర్చలు జరిపి వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని, పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం తెలిపారు.
చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ ఇటీవల జరిగిన నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదవశాత్తు అతను మృతి చెందారు, ఆదివారం బాలకృష్ణ పార్థివదేహానికి సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సుందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ కుటుంబానికి ఒక కోటి 50 లక్షల రూపాయలు ఇప్పించి, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా కల్పించారని అన్నారు.
