వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచి

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచి

జన్నారం,ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహాయ సహకారంతో ఆదేశాల మేరకు జిల్లా సహాయ సహకార అధికారి సూచనతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కొత్తూరుపల్లెలో సదాశివ రైతు మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం మధ్యాహ్నం దేవునిగూడ సర్పంచి రామటెంకి రాజేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులంతా కలిసి సదాశివ రైతు మ్యాక్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని తొలిసారిగా ఈ ఏడాది ఎమ్మెల్యే సహకారాలతో నూతనంగా నిర్వాహకులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో కొనడం జరుగుతుందని ఆయన తెలిపారు.రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ గుర్రం మోహన్ రెడ్డి, దేవునిగూడ ఉపసర్పంచి కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,పెరిక సంఘం మండల గౌరవాధ్యక్షుడు ఎంబడి సత్తన్న,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంబడి చంద్రమౌళి, గ్రామ వార్డు సభ్యుడు ఎంబడి పోశన్న,ఆ కేంద్రం నిర్వాకుడు ఎంబడి మహేష్, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply