Telangana | గోదావరిలో మృతదేహం లభ్యం..
Telangana | గోదావరిలో మృతదేహం లభ్యం..
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : గత పదిరోజుల క్రితం మిస్సైన గూడ మల్లేష్ (51) మృతదేహం లభ్యమైంది,దండేపల్లి మండలంలోని నగసముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేష్,అతని స్నేహితులతో కలిసి జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా అక్కడకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు టార్చి లైట్ పట్టుకొని వెళ్లగా పోలీసులు వస్తున్నారని భయంతో పరుగులు పెట్టారాని అప్పటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు జన్నారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 10 రోజుల నుంచి లక్షెటిపేట సి ఐ రమణమూర్తి,ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, దండేపల్లి, జన్నారం, లక్షెటిపేట, ఎస్సైలు,కుటుంబ సభ్యులు, ఎక్కడ వెతికిన మల్లేష్ ఆచూకీ కనబడలేదు, శనివారం గుడిరేవు సమీపంలోని గోదావరిలో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించాగా పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని గుర్తించారు,అయితే గోదావరి నది నుండి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షెటిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు,మృతుడు మల్లేష్ కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

