ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్

ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్

నిరుపేద వధువు పెళ్లికి రూ.50 వేల సహాయం

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మాణిగూడ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మాణిగూడ సర్పంచ్ జాదవ్ జానబాయి గణపత్ రావు దంపతులు ఎన్నికలలో అమలు చేయుటకు శనివారం శ్రీకారం చుట్టారు. మణిగూడ గ్రామపంచాయితీ సర్పంచ్ ఎన్నికలో భూమి లేని నిరుపేద‌ కుటుంభం ఆడ బిడ్డ పెళ్లికి 50,000 (యాభై వేలు )ఇస్తా అని హామీ ఇచ్చారు.

హామీ పథకారంగా గెలిచిన తర్వాత సర్పంచ్ దంపతులు జాదవ్ జానా బాయి గణపత్ రావులు పంచాయతీలోని రాంనగర్ తండాకు చెందిన రాథోడ్ మోహన్ కమల దంపతుల కుమార్తె అయిన అశ్విని పెళ్లికి శనివారం సర్పంచ్ దంపతులు 50000 నగదు సహాయం రూపాయలను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మాట చెప్పకుండా మొదటి హామీ అమలు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.

సేం అందించిన సర్పంచ్ దంపతులకు అశ్విని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ దంపతులకు ప్రజలు, వార్డ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నగదు సహాయ పంపిన కార్యక్రమంలో గ్రామ నాయకులుచవాన్ అంబాజీ, రాథోడ్ భీంజీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply