ఘనంగా సామూహిక శ్రీమంతాలు

ఘనంగా సామూహిక శ్రీమంతాలు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఐసిడిఎస్ కార్యాలయంలో ‘పోషణ పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బిడ్డ శారీరక ఎదుగుదలకు పోషకాహారం ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు.
ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి గర్భిణీ, బాలింత సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వానరాశి మరియమ్మ మార్క్ , ఎంపీడీవో కె సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఏపీఎం సత్యనారాయణ, సీడీపీవో స్వరాజ్యం, సూపర్వైజర్లు ఆండాలు, జ్యోతి , అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
