మోత్కూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు..

మోత్కూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంతో పాటు,మండలంలోని ఆయా గ్రామాల్లో రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి అంగడి బజార్ లోని ఈద్గా వద్ద మత గురువుల (ఇమామ్ సాబ్స్) ఆధ్వర్యంలో పెద్దలు, చిన్నారులు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన ల అనంతరం ఒకరికొకరు ఆ లింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులు స్థానిక కబరస్థాన్కు వెళ్లి వారి పూర్వీకుల సమాధుల వద్ద పూలు చల్లి ప్రార్థనలు నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్ ముబారక్ చెప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎం డి నబీ,ఇబ్రహీం, మార్కెట్ డైరెక్టర్ ఎం డి సమీర్,ముస్లిం పెద్దలు ఖాజా మొయినుద్దీన్, జానీ, షాబోద్దీన్,మున్నీరు, అమీర్, మహమ్మద్ అలీ,జహంగీర్ పాషా,జమాల్,జలాల్, ఆయాజ్,రియాజ్,వహీద్,రఫీ,ఫక్కీర్ అహ్మద్, హాజీ,ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
