ఉప్లూర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ఉప్లూర్‌లో ఉచిత వైద్య శిబిరం.
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ బుధవారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ముప్పై సంవత్సరాల పై బడిన వాళ్లందరికీ ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేసారు.
అలాగె వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కలిగించి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నర్సింహ స్వామి, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్ వార్డ్ సభ్యులు సురేష్, సాదుల్లా, నాయకులు మారుపక నరేష్, ఏఎన్ఎం అరుణ కుమారి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
