చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ ..

చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ ..

పి.4 పథకం ద్వారా జీవనోపాధి సాధనాల పంపిణీ

పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ డివిజన్లోని పలువురు పేదలకు,మధ్యతరగతి చిరు వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వం కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 59వ డివిజన్ సింగ్‌నగర్ కృష్ణ హోటల్ సెంటర్‌లో నివాసముంటున్న బస్సు వరప్రసాద్ రూ.30,000 విలువైన టిఫిన్ బండిని, అలాగే 61వ డివిజన్ ప్రకాష్ నగర్‌కు చెందిన గొట్టిపర్తి సరితకి రూ.30,000 విలువైన ఇస్త్రీ బండిని పి.4 పథకం ద్వారా అందజేశారు.

ఈ సహాయం ద్వారా ఇద్దరు లబ్ధిదారులు తమ స్వంత ఉపాధిని స్థిరపరుచుకుని, కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకునే అవకాశం పొందడం జరిగిందని సిద్దార్ధ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్, బంగారు నాయుడు,బుదాల సురేష్, బీసీ సెల్ జిల్లా నాయకులు మరక శ్రీనివాస్, కంచేటి నాగరాజు, దేవర సత్యనారాయణ, లక్కీశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply