ఆర్టీసీ సమ్మెతో.. ప్రయాణాలు అస్తవ్యస్తం

ఆర్టీసీ సమ్మెతో.. ప్రయాణాలు అస్తవ్యస్తం

  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • డిగ్రీ సెమ్ టు పరీక్షలు విద్యార్థుల అవస్థలు
  • కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళుతున్న ఆటోలు
  • ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ఆటోలు
  • ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్న ప్రయాణికులు

పరకాల, ఆంధ్రప్రభ : ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు, డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పరకాల ఆర్టీసీ నుండి ప్రయాణికుల నిత్యం రద్దీతో కూడుకొని ఉంటుంది. పరకాల మండలం తో పాటు సమీప మండలాల గ్రామాల ప్రజలు వ్యక్తిగత అవసరాలపై, అత్యవసర సమయంలో ప్రయాణాల కోసం పరకాల ఆర్టీసీ ప్రాంగణంకు చేరుకొని పరకాల నుండి హనుమకొండ, భూపాలపల్లి, హుజురాబాద్, నర్సంపేట, ములుగు తదితర ప్రాంతాలకు మూల బిందువుగా పరకాల ఆర్టీసీ డిపో ఉండడం వల్ల పరకాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి ప్రజలు వారు గమ్యాలకు వెళ్లడం జరుగుతుంది.

ఈ తరుణంలో ఆర్టీసీ సమ్మె వల్ల ఆర్టీసీ ప్రాంగణంలో ప్రయాణికులు వారి గమ్యాలకు వెళ్లేందుకు బస్సుల కోసం పడి కాపులు కాస్తున్నారు. వేసవి తీవ్రత వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. నేటి ( బుధవారం రోజు )నుండి డిగ్రీ సెమ్ టు పరీక్షలు మొదలు కావడంతో పరకాల పట్టణ పరిసర గ్రామాల నుండి హనుమకొండ, వరంగల్ కళాశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి వస్తు చదువుకునే విద్యార్థులు బుధవారం నుండి మొదలైన పరీక్షలకు హాజరవుటకు పరకాల బస్టాండుకు వచ్చి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలు టాటా మ్యాజిక్, ఆటోల వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. టాటా మ్యాజిక్, ఆటోలు హనుమకొండకు వెళ్ళుటకు ఒకరికి వంద రూపాయల చొప్పున ఛార్జి తీసుకోవడం జరుగుతుందని ప్రయాణికులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాలలో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం జరుగుతున్నది. ప్రయాణికుల, విద్యార్థుల కోసం ఆర్టీసీ వారు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు వాహనాలలో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉండటం వల్ల ప్రయాణికులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ వారు ప్రయాణికుల, విద్యార్థుల ప్రయాణల కోసం సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Leave a Reply