ఘనంగా అంబేద్కర్ జయంత్యోత్సవ ర్యాలీ

ఘనంగా అంబేద్కర్ జయంత్యోత్సవ ర్యాలీ

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: మాల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ జయంతి కార్యక్రమం మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్డు నుంచి మొదలుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటపాటలు, నినాదాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కన్న, యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, విజయరావు, నాగయ్య, పుండరీకం, మొగులయ్య, జగన్నాథం, రాజు, శ్రీనివాస్, బి.జనార్ధన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply