కేంద్ర కారాగారంలో మామిడి పండ్ల బహిరంగ వేలం

కేంద్ర కారాగారంలో మామిడి పండ్ల బహిరంగ వేలం

  • జైలు సూప‌రింటెండెంట్ సంతోష్ కుమార్‌ రాయ్‌

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి కేంద్ర కారాగారం ప్రాంగ‌ణంలోని మామిడి తోటలో మామిడి పండ్లను విక్రయించేందుకు వేలం వేస్తున్న‌ట్టు జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బహిరంగ వేలం మే 22వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కందిలోని సంగారెడ్డి సెంట్ర‌ల్ జైలు వ‌ద్ద నిర్వహింస్తున్న‌ట్టు సూప‌రింటెండెంట్ పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5వేల‌ ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వేలంలో పాల్గొనే వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. మామిడి పంటను దక్కించుకున్న వారు వెంటనే పూర్తి మొత్తాన్ని చెల్లించి పండ్లను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి కలిగిన వర్తకులు పాల్గొని అవకాశాన్ని వినియోగించుకోవాలని జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్‌ కోరారు.