విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం

విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం

  • 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ నెల 20వ తేదీన ఆద్యశిల స్థాపనోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. శనివారం ఆశ్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అష్టోత్తర శతావర్తన హనుమాన్ చాలీసా పారాయణంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు భక్తుల చేత శిలలపై బీజాక్షరాలు రాయించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విద్యాపీఠ సభ్యులు తోపాజి అనంత కిషన్, నీలం మధు, ప్రశాంత్ కుమార్, సెంథిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply