రాష్ట్ర స్థాయి ర్యాంక్ కైవసం..

రాష్ట్ర స్థాయి ర్యాంక్ కైవసం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తొర్పునూరి నేహాశ్రీ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో 470కి 466 మార్కులు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక మార్కులు సాధించిన నేహశ్రీని అభినందిస్తూ… చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ రూ. 5 వేలు, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి రూ. 5 వేలు, ఓరగంటి ఎట్టయ్య అంజమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఓరగంటి శ్రీనివాస్ గౌడ్ రూ. 5 వేలు, స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్ చేతుల మీద రూ. 10,116 లు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్, ఊడుగు జ్యోతి రమేష్, కొయ్యడ శేఖర్, నాయకులు ఊడుగు శ్రీనివాస్ గౌడ్, సుర్కంటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.