భక్తులకు వేసవి ఉపశమనం..

భక్తులకు వేసవి ఉపశమనం..

ఎండ తీవ్రత కు ప్రత్యేక ఏర్పాట్లు
మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ..
చలువ పందిళ్లతో భక్తులకు ఉపశమనం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ అధికమైంది. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లు నిండిపోవడంతో కొండపై సందడి నెలకొంది. ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.

క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యం, చలువ పందిళ్లు, విశ్రాంతి ఏర్పాట్లు చేసి భక్తులకు ఉపశమనం కల్పిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సిబ్బంది సేవలందిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో రద్దీ నియంత్రణ చేపడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా, ఎండ తీవ్రత మధ్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply