Suicide | కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు ఎన్ఆర్ఐ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణునాథ్ (18) ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించాడు. వేణునాథ్ మృతి గురించి కుటుంబ సభ్యులకు కాలేజీ సిబ్బంది తెలియజేశారు. కొడుకు ను విగత జీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
ప్రేమ వ్యవహారమే వేణునాథ్ ఆత్మహత్యకు కారణమని ఎన్ఆర్ఐ సిబ్బంది చెబుతున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్ దొరికిందని పేర్కొన్నారు. అయితే అందులోని చేతి రాత తమ అబ్బాయిది కాదని వేణునాథ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.