అత్యధిక సభ్యత్వాల నమోదు అభినందనీయం..

అత్యధిక సభ్యత్వాల నమోదు అభినందనీయం..

సాధకులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘన సన్మానం

కోడూరు – ఆంధ్రప్రభ : అత్యధిక జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు చేసిన సాధకులు అభినందనీయులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరులో అత్యధికంగా 1,501 జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేసిన పార్టీ సాధక్ బచ్చు వెంకటేష్, అత్యధికంగా 1,237 ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేసిన జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు కోట రాంబాబులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వయంగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

జనసేన పార్టీ బలోపేతానికి అత్యధిక ఉద్యమి సభ్యత్వాలు కీలకంగా గెలుస్తాయన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల నమోదులో అత్యున్నత స్థానంలో నిలిపిన సాధకులను అభినందించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సిద్ధినేని అశోక్ నాయుడు, కాగిత రామారావు, జరుగు పోతురాజు, బచ్చు పూర్ణచంద్రరావు, అప్పికట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply