Prime Minister | పార్లమెంట్‌లో ఆసక్తికర దృశ్యం..

Prime Minister | పార్లమెంట్‌లో ఆసక్తికర దృశ్యం..

Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎప్పుడూ రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

పార్లమెంట్ ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రేరణా స్థల్‌కు చేరుకున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు తారసపడ్డారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రధాని మోదీ ముందుగా రాహుల్ గాంధీని పలకరించగా, రాహుల్ కూడా నమస్కరించి స్పందించారు.

అనంతరం ఇరువురు నేతలు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, స్నేహపూర్వక సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply