గొప్ప మానవతావాది పూలే…

గొప్ప మానవతావాది పూలే…

నాగాయలంక – ఆంధ్రప్రభ : అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప మానవతావాది ,సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ నేత తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు లకనం నాగాంజనేయులు, టీడీపీ జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత లు అన్నారు. జ్యోతిరావు పూలే 200వ జయింతిని స్థానిక బీసీ సంఘాల ఆధ్వర్యంలో బోస్ విగ్రహం సెంటర్లో నిర్వహించారు.

అడుగంటిన మానవ విలువల కొరకు,కొందరికే పరిమితమైన విద్యను అందరికీ అందేలాగు ఆధునిక భారత దేశంలో ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఎ పి క్రాబ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు రేవు సువర్ణరాజు, డి ఎఫ్ సి ఎస్ డైరెక్టర్ కర్రి కృష్ణమూర్తి, మాజీ డైరెక్టర్ నాగిడి తాతారావు లు మాట్లాడుతూ పూలే స్పూర్తి ప్రదాత అని నేటి తరం యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కొక్కిలిగడ్డ నరసింహారావు,మౌలాలి,బుల్లిబసవయ్య, ఒడుగు.సాంబశివరావు, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మిఠాయిలు పంచారు.

Leave a Reply