ప్రభుత్వ పథకాలు వివరిస్తూ..

ప్రభుత్వ పథకాలు వివరిస్తూ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి స్ఫూర్తితో మహనీయుని ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన దివంగత మాజీ మంత్రి ఎల్లారెడ్డి తనయుడు ఎల్కోటి జనార్దన్ రెడ్డి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎంపిక కావడంతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రజా సమస్యలు గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా అధికారి ప్రతినిధిగా ఎన్నికైన ఎల్కోటి జనార్దన్ రెడ్డి పలు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ లో చురుకైన నాయకుడిగా పని చేసుకోవడంతో ఆయన సేవలను గుర్తించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించిందని అన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు గ్యారెంటీగా అమలు చేస్తుందని అన్నారు. ఊట్కూర్ మండలంలో కాంగ్రెస్ శ్రేణులను కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రానున్న ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేసే విధంగా చూస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. దివంగత మాజీ మంత్రి ఎల్లారెడ్డి కలలు నిజం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కుక్కు లింగం, వార్డు సభ్యులు కొక్కు మల్లేష్, సువర్ణ రవి కుమార్, పల్లె అనిల్ రెడ్డి, నాయకులు గోవిందప్ప, గోపాల్ రెడ్డి, శంకర్, అలీమ్, జమీర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply