ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు..
ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు..
హుజూర్నగర్ రూరల్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ న్యాయవాదుల సంఘానికి జరిగిన ఎన్నికలలో 10 పదవులకు గాను 9 పదవులు సాముల రాంరెడ్డి వర్గం గెలుచుకొని ఘన విజయం సాధించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నారపరాజు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్.వి రమణారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా రమాదేవి, గ్రంథాలయ కార్యదర్శిగా ధూళిపాల శ్రీనివాసరావు, కోశాధికారిగా గొట్టే ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా చిట్టిపోతుల రమేష్, జక్కుల నవీన్, బుడిగె నరేష్, షేక్ నాగపాషాలు రాంరెడ్డి వర్గం నుండి తమ సమీప ప్రత్యర్థుల పై విజయం సాధించారు. కాగా ఉపాధ్యక్షులుగా జక్కుల వీరయ్య గెలుపొందాడు. అధ్యక్షులుగా గెలిచిన నారపరాజు శ్రీనివాసరావును న్యాయవాదులతో పాటుగా పట్టణ ప్రముఖులు కోర్టు ప్రాంగణంలో పూలమాలలు, శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు.
