దివ్య సత్ప్రసాద స్థాపన..

దివ్య సత్ప్రసాద స్థాపన..

గుడివాడ, ఆంధ్రాప్రభ : గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పునీత అవిలాపురి థెరిసా దేవాలయం నందు పవిత్ర గురువారం ప్రార్థనల్లో గురువు (Priest) 12 మంది వ్యక్తుల పాదాలను కడిగే ఆచారాన్ని పాటించారు, ఇది యేసు చేసిన పనిని స్మరించుకోవడానికి గుర్తు అని తెలిపారు.

ఫాదర్ లూయిస్ జయరాజు మాట్లాడుతూ పవిత్ర గురువారం (Maundy Thursday) క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇది యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి జరుపుకున్న ‘చివరి భోజనం’ (Last Supper), దివ్య సత్ప్రసాద స్థాపన, మరియు శిష్యుల పాదాలు కడగడం ద్వారా వినయానికి నిదర్శనంగా నిలిచిన సంఘటనను గుర్తుచేస్తుంది. ఇది గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే గురువారం, తపస్సు కాలం (Lent) ముగింపును సూచిస్తుంది.